SDPT: అక్కన్నపేట మండలం మల్చెరువు తండా, దుబ్బతండా, కపూర్ నాయక్ తండా గ్రామాల్లో నాటు సారా తయారీ కేంద్రాలపై డీటీఎఫ్, హుస్నాబాద్ ఎక్సైజ్ పోలీసులు ఇవాళ సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రెండు లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకుని, సుమారు 100 లీటర్ల బెల్లం పానకం నిల్వలను ధ్వంసం చేశారు. ఘటనలో ఇద్దరిపై కేసులు నమోదు చేసినట్లు సీఐ పవన్ తెలిపారు.