MLG: గోవిందరావుపేటలో కోతులకు పెట్టిన విషపదార్థం తిని బాలుడు అశ్విత్నందన్ మృతి చెందిన ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పస్రా సీఐ దయాకర్ మాట్లాడుతూ.. నిందితులను గుర్తించేందుకు ప్రత్యేకంగా విచారణ కొనసాగుతున్నదన్నారు. బాలుడి తండ్రి ఇరుగు శ్రావణ్ ఫిర్యాదు మేరకు రైతు సతీష్‌తో పాటు గ్రామపంచాయతీ సిబ్బందిని ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు.