BDK: అశ్వాపురంలో బుధవారం ప్రజాపాలన ప్రగతి 99రోజుల ప్రణాళికలో భాగంగా పోలీసుల ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్ సెంటర్ వద్ద అశ్వాపురం జడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులతో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా సర్పంచ్ బానోత్ సదర్ లాల్ మాట్లాడుతూ.. రహదారులపై నిర్లక్ష్యంగా ప్రయాణించడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారన్నారు.