WGL: గ్రేటర్ వరంగల్ నగరంలో సమగ్ర అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ జీవో ఆర్టి నెంబర్ 322 ద్వారా 5257.20 కోట్ల వ్యయంతో పరిపాలనా అనుమతి మంజూరు చేసింది. ఫేజ్-1 కింద ఈ ప్రాజెక్టును అమలు చేస్తారు. ఆధునిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ నిర్ణయం కీలకమని అధికారులు తెలిపారు.