KMR: జిల్లా కేంద్రంలో ఫ్లయింగ్ అకాడమీ ఏర్పాటు చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడిని కామారెడ్డి MLA వెంకటరమణారెడ్డి కోరారు. రాష్ట్ర రాజధానికి అతి తక్కువ దూరంలో జాతీయ రహదారి, రైల్వే స్టేషన్ అందుబాటులో ఉన్నాయని, ప్రభుత్వ భూమిలో ఫ్లయింగ్ అకాడమీ ఏర్పాటు చేస్తే KMR అభివృద్ధి చెందటమే కాకుండా యువతకు ఉపాధి అవకాశాలు ఉంటాయని వినతి పత్రం అందచేశారు.