KMR: దోమకొండ మండల కేంద్రంలోని బాలికల రెసిడెన్షియల్ హాస్టల్‌ను, జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థినులతో మమేకమై, ఒక్కొక్కరితో మాట్లాడి వారి ఆశయాలు, లక్ష్యాలను తెలుసుకున్నారు. వసతి గృహంలో మెనూ ప్రకారం భోజనం సక్రమంగా అందిస్తున్నారా అని, విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు.