KNR: వెన్కేపల్లి-సైదాపూర్ విశాల సహకార పరపతి సంఘం ఆవరణలో రైతులకు సబ్సిడీపై జీలుగ (పచ్చిరొట్టె), వరి విత్తనాలను ఏఎంసీ ఛైర్మన్ దొంత సుధాకర్, ఎల్ఎస్సీఎస్ ఛైర్మన్ కొత్త తిరుపతిరెడ్డి పంపిణీ చేశారు. వానాకాలం సాగులో భూసారాన్ని పెంచే పచ్చిరొట్టె ఎరువులు, నాణ్యమైన విత్తనాలను రైతులు వినియోగించుకోవాలని ఏవో వైదేహి సూచించారు.