BHPL: మహాదేవపూర్ సబ్‌డివిజన్ పరిధిలోని రైతులకు 50% రాయితీపై జీలుగు, జనుము విత్తనాల పంపిణీ చేపట్టనున్నట్లు ఏడీఏ శ్రీపాల్ తెలిపారు. మొత్తం సబ్ డివిజన్ కు170 క్వింటాళ్ల విత్తనాలు మంజూరైనట్లు ఆయన వెల్లడించారు. డివిజన్ పరిధిలోని అర్హులైన రైతులు ఆధార్ కార్డు, పట్టాదారు పాస్‌బుక్‌తో సంబంధిత వ్యవసాయ అధికారులను సంప్రదించి విత్తనాలు పొందాలని సూచించారు.