HNK: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిని ఆరే కుల సంక్షేమ సంఘం నేతలు కలిసి వినతిపత్రం అందజేశారు. గతంలో కాజీపేట మండలంలో కొంత స్థలాన్ని ఆరె సంక్షేమ సంఘానికి కేటాయించినప్పటికీ, ఇప్పటివరకు ఆ స్థలాన్ని సంఘానికి అప్పగించలేదని తెలిపారు. స్థలాన్ని సంఘానికి అధికారికంగా అప్పగించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేను నేతలు కోరారు.