ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆయిల్ఫామ్ సాగుకు చిరునామాగా మారుతోంది. ప్రభుత్వం రాయితీపై కేవలం రూ. 20లకే మొక్కలు అందజేస్తుండటంతో అన్నదాతలు ఈ సాగుపై మక్కువ చూపుతున్నారు. ఇప్పటికే జిల్లాలో సుమారు 15 వేల మంది రైతులుఆయిల్ఫామ్ సాగు చేస్తూ లాభాల బాటలో పయనిస్తున్నారు. మంత్రి తుమ్మల చొరవతో అధికారులు నిర్వహిస్తున్న అవగాహన సదస్సులు సత్ఫలితాలనిస్తున్నాయి.