MDK: కేరళ రాష్ట్రం తరహాలో తెలంగాణలో ఉచిత విద్యను అందించే ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ప్రశ్నించారు. బుధవారం గద్వాల జిల్లా కేంద్రంలోని వాల్మీకి కమిటీ హాల్లో నిర్వహించిన పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలకు ఉచిత విద్యను కాంగ్రెస్ అందించలేదన్నారు.