వెటరన్ పేసర్ షమీ సెలక్షన్ కమిటీపై మరోసారి పరోక్ష విమర్శలు చేశాడు. బెంగాల్ ప్రో టీ20 లీగ్ మూడో సీజన్ ప్రారంభ కార్యక్రమానికి హాజరైన షమీ.. యువ ఆటగాళ్లను ఉద్దేశించి మాట్లాడాడు. అవకాశాలు మనల్ని వెతుక్కుంటూ వచ్చే వరకు నిరంతరం శ్రమించాలని చెప్పాడు. ‘మనం రోజువారీ కూలీలం మాత్రమే’ అని పేర్కొన్నాడు. ఒక్కోసారి అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ అవకాశాలు దక్కకపోతే కుంగిపోకూడదని హితవు పలికాడు.