TG: కొమురంభీం పెద్దవాగు రైల్వే బ్రిడ్జి పనుల్లో ప్రమాదం జరిగింది. బ్రిడ్జి పైనుంచి ముగ్గురు కార్మికులు జారిపడ్డారు. ఈ క్రమంలో బ్రిడ్జి మధ్యలో ఓ కార్మికుడు ఇరుక్కుపోయాడు. ప్రమాద స్థలంలోనే రెస్క్యూ టీమ్ అతడికి చికిత్స అందిస్తోంది. మరో ఇద్దరు కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి.