JGL: రాయికల్ మండలం కిష్టంపేట్ గౌడ సంఘం సభ్యులు జగిత్యాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ను బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గౌడ సంఘం అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఆయనకు వినతిపత్రాన్ని అందజేశారు. ఎమ్మెల్యే నిధుల మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. కలిసిన వారిలో సర్పంచ్ అంజిగౌడ్, మాజీ AMC డైరెక్టర్ ఉన్నారు.