NRML: ముధోల్ నియోజకవర్గంలో బుధవారం ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ ఆధ్వర్యంలో 144 మంది లబ్ధిదారులకు రూ.35.50 లక్షల సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. పేదలకు వైద్య సహాయం అందించడమే లక్ష్యమని తెలిపారు. ఇప్పటివరకు రూ.4 వేల మందికి పైగా సహాయం అందించామని, నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స కోసం పలువురికి ఎల్వోసీలు మంజూరు చేశామని తెలిపారు.