ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ, గుజరాత్ మధ్య జరగనున్న మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉంది. సాయంత్రం ఉరుములతో కూడిన భారీ వర్షం పడే అవకాశం 51% ఉన్నట్లు వాతావరణ నివేదికలు చెబుతున్నాయి. అయితే, మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి వాతావరణం అనుకూలించనున్నట్లు తెలిపాయి. ఒకవేళ వర్షం పడినా, స్టేడియంలో ఉన్న అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థ వల్ల మ్యాచ్ త్వరగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది.