సూర్యాపేటలోని 27వ వార్డులో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న’ఇందిరా మహిళా శక్తి’ పథకం కింద చీరల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వార్డ్ కౌన్సిలర్ చిరివెళ్ళ లక్ష్మీకాంతమ్మ వెంకటేశ్వర్లు సమక్షంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వార్డులోని అర్హులైన మహిళలు, స్వయం సహాయక సంఘాల సభ్యులకు నీలిరంగు డిజైనర్ చీరలను పంపిణీ చేశారు.