MDK: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని మెదక్ పట్టణం నవాబ్పేటలోని ఈద్గా వద్ద జరుగుతున్న ఏర్పాట్లను మున్సిపల్ వైస్ ఛైర్మన్ దొంతి నరేష్ గౌడ్ పరిశీలించారు. పండగ రోజున ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారని, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పించాలని మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు. పరిశుభ్రత, తాగునీరు వంటి సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్నారు.