KNR: “మన జనాభా గణన – మన అభివృద్ధి” అనే నినాదంతో జనాభా గణన 2027కు సంబంధించి ఏర్పాటు చేసిన అవగాహన ఫ్లెక్సీలను జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ.. జనాభా గణన దేశంలో అతిపెద్ద ప్రజల భాగస్వామ్య కార్యక్రమమని పేర్కొన్నారు.