MBNR: హన్వాడ మండల కేంద్రంలో జరిగిన ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ క్రీడల్లో రామ్ నాయక్ తండా క్రీడాకారులు ప్రతిభ కనబరిచారు. ఫైనల్ మ్యాచ్లో పెద్దదర్పల్లి జట్టును ఓడించి కప్పు సాధించారు. జట్టు సమష్టి కృషితోనే విజయం సాధ్యమైందని క్రీడాకారులు తెలిపారు. విజేతలను అభినందించిన గ్రామ పెద్దలు భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.