HYD: మహాత్మా జ్యోతిబాపూలే ప్రజాభవన్‌లో ఇవాళ జరగాల్సిన సీఎం ప్రజావాణి కార్యక్రమం 7వ తేదీకి వాయిదా పడింది. గుడ్‌ఫ్రైడే సందర్భంగా సీఎం ప్రజావాణి నిర్వహించడం లేదని దరఖాస్తుదారులు ఈ మార్పును గమనించాలని స్టేట్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్ పేర్కొన్నారు. ఏడవ తేదీ మంగళవారం జరిగే ప్రజావాణి కార్యక్రమానికి హాజరుకావాలని తెలిపారు.