సత్యసాయి: రాజధాని అమరావతికి ఉభయ సభల ఆమోదం లభించిన శుభసందర్భంగా పెనుకొండ పట్టణంలోని మంత్రి సవిత నివాసం వద్ద సంబరాలు అంబరాన్నంటాయి. కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి మంత్రి పెద్ద ఎత్తున దీపాలు వెలిగించి బాణాసంచా కాల్చారు. ఆంధ్రుల కలల రాజధానికి రాజముద్ర పడటం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు.