HNK: యాదవ కులస్తులకు రాష్ట్ర మంత్రివర్గంలో ప్రాధాన్యత కల్పించాలని లేనిపక్షంలో గాంధీభవన్లో నిరాహార దీక్ష చేయడానికి వెనకాడమని సంఘం జాతీయ అధ్యక్షులు మేకల శ్రీరాములు యాదవ్ హెచ్చరించారు. హనుమకొండ జిల్లా కాజీపేటలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. యాదవ కులస్తులకు గొర్రెలు మేకలను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు మేకల కేదార్ యాదవ్ పాల్గొన్నారు.