SRD: విద్యార్థులు, నిరుద్యోగ యువత విజ్ఞానాన్నిపెంపొందించేందుకు లైబ్రరీ, స్టడీ సెంటర్ ఎంతో దోహదమని ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. నాగలిగిద్ద హైస్కూల్లో ఇవాళ ఓ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన గ్రంథాలయం, స్టడీ సెంటర్ను IRS అధికారి సుధాకర్ నాయక్తో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. నేటి పోటీ ప్రపంచంలో పుస్తక పఠనం ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు.