WGL: నర్సంపేట పట్టణం స్నేహనగర్లో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. బుధవారం చిలువేరు లక్ష్మణ్ కుటుంబం బయటకు వెళ్లిన సమయంలో దుండగులు బీరువా పగులగొట్టి రూ. 3.10 లక్షల నగదు, రెండున్నర తులాల బంగారు ఆభరణాలు దొంగిలించారు. భాదితులు ఫిర్యాదు మేరకు ఎస్సై అరుణ్, క్లూస్ టీం వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.