GDWL: మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ గురుకులాల్లో శానిటేషన్ వర్కర్లు, వాచ్మెన్ల జీతాల కోసం మే 28న విడుదల చేసిన టెండర్లను రద్దు చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్. రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ఐజలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఏజెన్సీల ద్వారా కాకుండా ప్రభుత్వమే జీతాలు చెల్లించాలని కోరారు.