NZB: TU పరిధిలోని M.Ed మొదటి సెమిస్టర్ పరీక్ష ఫీజు చెల్లింపుకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఈ నెల 15 వరకు, అపరాధ రుసుం రూ.100తో ఈనెల 20 వరకు విద్యార్థులు తమ ఫీజులు చెల్లించవచ్చని ఆయన పేర్కొన్నారు. పూర్తి వివరాలు యూనివర్సిటీ వెబ్సైట్లో పొందుపరిచామని ఆయన తెలిపారు.