KMM: మధిర బస్ డిపో వద్ద బుధవారం తెల్లవారుజాము నుంచే ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టారు. 2021, 2025 పీఆర్సీలను తక్షణమే అమలు చేయాలని, ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు. బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.