SRCL: జిల్లాలో మంగళవారం వరి ధాన్యం మద్దతు ధర పట్టికలను విడుదల చేశారు. క్వింటాల్ గ్రేడ్ “ఎ”రకం వడ్లకు రూ. 2389, సాధారణ రకం వడ్లకు రూ.2369 అని అధికారులు తెలిపారు. రైతులు నాణ్యత ప్రమాణాలకు లోబడి ఉన్న సరుకును మాత్రమే కేంద్రానికి తీసుకువచ్చి, కనీస మద్దతు ధర పొందాలని కోరారు. తేమ 17 శాతం కంటే తక్కువ ఉన్న ధాన్యాన్ని మాత్రమే కొనుగోలుచేస్తామని పేర్కొన్నారు.