సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయం మార్కెట్ సమీపంలో బుధవారం ఉదయం బైక్ను కారు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకెళితే.. అంతక పేట గ్రామానికి చెందిన చంద్రమౌళి పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోసుకొని బయటకు వస్తుండగా అతివేగంతో హనుమకొండ నుంచి వస్తున్న కారు వెనుక నుంచి కొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారుడు చంద్రమౌళికి తీవ్ర గాయాలు అయ్యాయి.