SRD: ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో కొత్త బస్టాండ్ ముందు కార్మికులు ఉద్యోగులు బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తాము అడుగుతున్నామని చెప్పారు. తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు సమ్మె చేస్తామని స్పష్టం చేశారు.