NZB: జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ట్రాఫిక్ సిబ్బందికి అవసరమైన యూనిఫామ్ సామగ్రి, కూలింగ్ గ్లాసులను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య నిన్న సాయంత్రం పంపిణీ చేశారు. సీపీ మాట్లాడుతూ.. ఎండ తీవ్రత దృష్ట్యా విధుల్లో ఉన్న సిబ్బంది ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని వీటిని అందజేసినట్లు తెలిపారు. ఈ క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు సేవలందించాలని సూచించారు.