PDPL: మొక్కజొన్న రైతులు అధైర్య పడవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు తెలిపారు. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో మంగళవారం మొక్కజొన్న, ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు నష్టపోకుండా ప్రభుత్వం సంకల్పంతో మక్కలు కొనుగోలు చేస్తుందని తెలిపారు.