TG: రాష్ట్రంలో ఎండల తీవ్రత మరింత పెరగనుంది. ఇవాళ 76 మండలాల్లో తీవ్ర వడగాలులు, 136 మండలాల్లో వడగాలుల ప్రభావం ఉండనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అవసరమైతేనే బయటకు వెళ్లాలని తెలిపారు. చిన్నపిల్లలు, వృద్ధులను జాగ్రత్తగా చూసుకోవాలన్నారు.