KMM: హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణాపాయం నుంచి తప్పుకోవచ్చని ఏసీపీ తిరుపతి రెడ్డి ఉన్నారు. ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురం గ్రామంలో నిర్వహించిన ‘అరైవ్-అలైవ్’ రోడ్డు భద్రతా కార్యక్రమంలో రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి పాల్గొన్నారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ అవగాహన కల్పించారు.