KNR: కరీంనగర్ టీఎన్జీవో ఫంక్షన్ హాల్లో మహిళా, శిశు, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభించారు. సుడా ఛైర్మన్ నరేందర్ రెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసిన ఆయన, అనంతరం అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లు, దివ్యాంగులకు మూడు చక్రాల వాహనాలను పంపిణీ చేశారు.