VKB: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఏఆర్ కానిస్టేబుల్కు పోలీసు శాఖ అధికార లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. బషీరాబాద్ మండలం రెడ్డి గణాపూర్కు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ నర్సప్ప(35) యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్ సమీపంలోని బ్రిడ్జి గుంతలో పడి మృతి చెందిన సంగతి తెలిసిందే. సోమవారం సాయంత్రం రెడ్డిగణాపూర్లో నర్సప్ప అంత్యక్రియలు నిర్వహించారు.