JN: చిల్పూరు మండలంలోని కృష్టాజీగూడెంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లను చేస్తామని ప్రజాప్రతినిధులు తెలిపారు. అనంతరం రైతులతో ప్రజాప్రతినిధులు మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.