Revanth Reddy : జనాభా ప్రకారం అన్ని కులాలకు రిజర్వేషన్లు : రేవంత్ రెడ్డి
జనాభా ప్రకారం అన్ని కులాలకు రిజర్వేషన్లు కల్పించడమే కాంగ్రెస్ పార్టీ అజెండా అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. శనివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
This is the intention behind changing TS to TG.. Revanth Reddy
Revanth Reddy : జనాభా ప్రకారం అన్ని కులాలకు రిజర్వేషన్లు కల్పించడమే కాంగ్రెస్ పార్టీ అజెండా అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. శనివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం దేశంలో 50శాతానికి పైగా బీసీలు ఉన్నారని, జనగణన చేసి వారికి రిజర్వేషన్లు పెంచుతామని రాహుల్ హామీ ఇచ్చారని రేవంత్ గుర్తు చేశారు. దేశ రాజకీయాలను, సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను ప్రభావితం చేసే అంశంపై మాట్లాడాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందన్నారు. అక్రమంగానో.. దౌర్జన్యంగానో.. 400 సీట్లు సాధించి రాజ్యాంగం ప్రాథమిక సూత్రాలపైనే దాడి చేయాలని బీజేపీ నేతలు మోడీ, అమిత్ షా నిర్ణయించుకున్నారని విమర్శించారు. అందులో భాగంగానే దేశం నలుమూలలా తిరుగుతూ అన్ని రకాల వ్యవస్థలు, సంస్థల్ని ఉపయోగించుకుని దాడి చేస్తున్నారని తెలిపారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత బీజేపీ పై .. కాంగ్రెస్ స్పష్టమైన ఆరోపణలు చేస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రశ్నలకు ఇప్పటి వరకు మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా సమాధానం చెప్పలేదన్నారు. ప్రజాస్వామ్య విలువలు, విధానాలకు విరుద్ధంగా వారు వ్యవహరిస్తున్నారంటూ రేవంత్ మండి పడ్డారు.
ఆర్ఎస్ఎస్ విధానాలను అమలు చేయాలని ప్రయత్నిస్తున్నరు.. వివిధ కులాలు, వర్గాలు ఉంటే హిందువులు ఏకతాటి మీదకురారు అనేది బీజేపీ కుట్ర. రిజర్వేషన్లు రద్దు చేస్తే.. వేర్వేరు కులాలు, వర్గాల ప్రస్తావన లేకుండా పోతుందనేది ఆ పార్టీ ఆలోచన అన్నారు. వచ్చే ఏడాదికి ఆర్ఎస్ఎస్ స్థాపించి వందేళ్లు అవుతుంది. 2025 నాటికి రాజ్యాంగాన్ని మార్చి, రిజర్వేషన్లు రద్దు చేయాలనేది ఆర్ఎస్ఎస్ లక్ష్యం. రాజ్యాంగాన్ని మార్చాలంటే మూడింట రెండొంతుల మెజార్టీ అవసరమన్నారు. అందుకే 400 సీట్లలో గెలిపించాలని మోడీ పదే పదే కోరుతున్నారన్నారు. భారత్‌ను రిజర్వేషన్ రహిత దేశంగా మార్చాలని మోడీ, అమిత్ షా భావిస్తున్నారని రేవంత్ మండి పడ్డారు.