NZB: ముప్కాల్ మండలం నల్లూరులో మహిళా సంఘ భవన నిర్మాణానికి సర్పంచ్ బర్కం గంగాధర్ శుక్రవారం భూమిపూజ చేశారు. బాల్కొండ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి చొరవతో NREGS నిధులు రూ. 10 లక్షలు మంజూరైనట్లు సర్పంచ్ తెలిపారు. ఈ నిధులతో భవనాన్ని త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ లావణ్య శ్రీనివాస్ పాల్గొన్నారు.