కోనసీమ: నియంతృత్వ పాలనకు చరమగీతం పలకాలని యానం ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గొల్లపల్లి శ్రీనివాస్ అన్నారు. శనివారం యానంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను గెలిస్తే అద్భుతాలు సృష్టిస్తానంటూ చెబుతున్న మల్లాడి గత 30 ఏళ్లుగా యానంకు ఏం చేశారో చెప్పాలన్నారు. కనీస పారిశ్రామిక అభివృద్ధికి కూడా మల్లాడి కృషి చేయలేదన్నారు.