మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో వానర సైన్యం దండయాత్ర చేస్తోంది. వందల సంఖ్యలో కోతులు గ్రామంలోకి రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఎండలు ముదరడంతో అడవుల్లో ఆహారం, నీరు లేక ఇళ్లపైకి, రోడ్లపైకి వస్తున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే గ్రామ సర్పంచ్ స్పందించి అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.