PDPL: మహాత్మ జ్యోతిబాపూలే జయంతి వేడుకలను విజయవంతం చేయాలని జిల్లా బీసీ అభివృద్ధి అధికారి రంగారెడ్డి ఇవాళ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 11న ఉదయం 10:30 గంటలకు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో వేడుకలు నిర్వహించబడతాయని పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు, నాయకులు, బీసీ కుల సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొనాలని తెలిపారు.