SRPT: నూతనకల్ మండల పరిధిలోని మిర్యాల గ్రామ సర్పంచ్ అనంతుల శ్రీనివాస్ తన మాతృమూర్తి జ్ఞాపకార్థం ఉదారత చాటుకున్నారు. శుక్రవారం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు భోజన ప్లేట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.