VKB: పెద్దేముల్ మండలం మంబాపూర్ గ్రామంలో సర్పంచ్ స్థానంలో ఆమె భర్త శ్రీనివాస్ అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ప్రతిపక్ష వార్డు సభ్యులు ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొంటూ కాంగ్రెస్ నాయకులు విలేకరుల సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు. సర్పంచ్ పాత్ర కనిపించకపోవడం, ప్రొటోకాల్ పాటించకపోవడంపై వారు విమర్శించారు.