PDPL: ధర్మారం మండలం నందిమేడారం తెలంగాణ సాంఘీక సంక్షేమ బాలికల పాఠశాలలో పీపుల్స్ యువసేన ఆధ్వర్యంలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవస్థాపకుడు మేకల సంజీవరావు మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆలోచనలు సమాజానికి మార్గదర్శకమని తెలిపారు. విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించి విజేతలకు ఎస్ఐ ప్రవీణ్ కుమార్ బహుమతులు అందజేశారు.