VKB: తాండూరు పట్టణంలోని విద్యుత్ డివిజన్ కార్యాలయ ప్రాంగణంలో డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యుత్ శాఖ అధికారులు, లైన్మెన్లు, కార్మికులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. దేశానికి బాబాసాహెబ్ అందించిన సేవలను ఈ సందర్భంగా వారు స్మరించుకున్నారు.