రాజస్తాన్ రాయల్స్ మేనేజర్ రోమీ భిందర్ డగౌట్లో మొబైల్ ఫోన్ వాడిన సంగతి తెలిసిందే. దీంతో అతడికి బీసీసీఐ షోకాజు నోటీసులు జారీ చేసింది. డగౌట్లో మొబైల్ ఫోన్ ఎందుకు వాడారో 24 గంటల్లోపు వివరణ ఇవ్వాలని పేర్కొంది. అయితే, IPL రూల్స్ ప్రకారం జట్టు మేనేజర్‌కు మొబైల్ ఫోన్ వాడే వెసులుబాటు ఉన్నప్పటికీ డగౌట్లో ఫోన్ వాడటంపై పూర్తి నిషేధం ఉంది.