SRCL: జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ ఆద్వర్యంలో సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వద్ద ఉన్న డా. బీ.ఆర్. అంబేద్కర్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విగ్రహానికి ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే తదితరులు పూలమాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించారు.