నిర్మల్ జామ మస్జీద్లో అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్ దేశంపైన జరిపిన దాడులకు వ్యతిరేకంగా ముస్లిం సోదరులు సోమవారం నిరసన తెలిపారు. ఈదాడిలో ఇరాన్ సుప్రీం నాయకుడు ఆయతుల్లా ఖామినీయి మృతి పట్ల తీవ్ర సంతాపం తెలియజేశారు. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ప్రపంచ శాంతికి భంగం కలిగిస్తూ ఇస్లామిక్ దేశాలపైన నిరంతరం దాడులు చేయడాన్ని ముక్త కంఠంతో ఖండించారు.